: అవిశ్వాస తీర్మానంపై వెనక్కు తగ్గిన జగన్


శీతాకాల పార్లమెంటు సమావేశాల సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని లోక్ సభ సంయుక్త కార్యదర్శి వీఆర్ రమేశ్ వెల్లడించారు. సమావేశాల సమయంలో ఎంతమంది సభ్యులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారో వివరాలు తెలపాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ లోక్ సభ సంయుక్త కార్యదర్శికి ఓ లేఖ రాశారు. స్పందించిన కార్యదర్శి ఈ మేరకు పై వివరాలు తెలిపారు.

డిసెంబరు 9 నుంచి 18 వరకు ఎంపీలు రాయపాటి, సబ్బం హరి, ఉండవల్లి, సాయి ప్రతాప్, లగడపాటి, హర్షకుమార్, కొణకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, మోదుగుల, వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి ప్రతిరోజు సభలో నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, వారి తీర్మానాలను పరిగణనలోకి తీసుకునే లోగానే జగన్, మేకపాటి వెనక్కి తీసుకున్నారని రమేశ్ కు ఇచ్చిన లేఖలో వివరించారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం రమేశ్ అసెంబ్లీలో సభ్యులకు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులెవరూ అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోకపోగా వైఎస్సార్సీపీయే వెనక్కి తగ్గడం గమనార్హం.

  • Loading...

More Telugu News