: ఆప్ విజయం ప్రజాస్వామ్యానికి మంచిది: అమర్త్యసేన్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ తెలిపారు. జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల ప్రజాసమస్యలు ఎన్నికల ఎజెండాగా ఎలా మారతాయో ఆమ్ ఆద్మీ పార్టీ చేసి చూపించిందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆప్ తొలి అడుగు విజయవంతంగా వేసిందని, ఇదే స్పూర్తితో ఆ పార్టీ సుదూర ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News