: తొమ్మిదో తేదీ వరకూ అనూహ్య ఫోన్ కు సిగ్నల్స్: రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్
ముంబయిలో దారుణ హత్యకు గురైన తెలుగమ్మాయి అనూహ్య కేసు దర్యాప్తులో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం లేదని రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీన అనూహ్య ముంబయి లోకమాన్య తిలక్ రైల్వేస్టేషన్ లో దిగినట్లు ఆయన ఇవాళ (శుక్రవారం) తెలిపారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోపే కేసు దర్యాప్తు వివరాలు కనుగొని ముంబయి పోలీసులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో 9వ తేదీ వరకూ అనూహ్య సెల్ ఫోన్ కు సిగ్నల్స్ అందినట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనూహ్య కనిపించకుండా పోయి.. ముంబయిలో శవమై తేలిన విషయం తెలిసిందే.