: నాలుగు రాష్ట్రాల్లో ఓటమితో నిరాశ పడవద్దు: ప్రధాని
ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ధైర్యం నూరిపోశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే.. అది చూసి నిరాశకు లోనుకావల్సిన అవసరం లేదని చెప్పారు. యూపీఏ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే 2014 ఎన్నికల్లో విజయం పార్టీదే అవుతుందన్నారు. కాంగ్రెస్ విజయం అంటే రాహుల్ గాంధీ విజయమేనన్న ప్రధాని, దేశంలో లౌకికవాదాన్ని రక్షించగల ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. అర్థిక వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ప్రతిపక్షం ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తోందని వ్యాఖ్యానించారు.