: నటుడు సిద్ధార్ధ్ తండ్రికి గుండెపోటు
సినీ నటుడు సిద్ధార్ధ్ తండ్రి సూర్య నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీకాళహస్తిలో దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో సిద్ధార్ధ్ తండ్రికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే చికిత్స అందించేందుకు ఆయనను తిరుపతి ఆసుపత్రికి తరలించారు.