: నేను అభిమన్యుడికంటే గట్టివాడిని.. నన్ను చూసి భయపడుతున్నారు: శైలజానాథ్


తాను శాసనసభలో అభిమన్యుడిలాంటి వాడినని, అందుకే తాను మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారని మంత్రి శైలజానాథ్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడటాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తుండడంతో తాను మాట్లాడితే ఎక్కడ ప్రజలకు నిజాలు తెలుస్తాయోనని భయంతో వణికిపోతున్నారని అన్నారు. తెలుగు జాతిని ముక్కలు చేస్తున్న ఈ నిర్ణయంపై మాట్లాడేందుకు తనకు అన్ని రకాల హక్కులు ఉన్నాయన్న ఆయన నినాదాలు చేస్తున్న వారికి సమాధానం ఇస్తూ, నేను 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మంత్రినని, ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News