: విభజనను కోరుకుంటోంది అప్పుడు వైయస్, ఇప్పడు వైకాపా: పయ్యావుల
నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదానికి బీజం వేస్తే... ఇప్పటి వైఎస్సార్సీపీ సభ్యులు రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ శాసనసభలో ఆరోపించారు. వైఎస్సార్సీపీ సభ్యులు బయట ఒక విధంగా, సభలో మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ నుంచి తప్పించుకోవడానికి, ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేందుకు... వైకాపా ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్ చేస్తున్నారని అన్నారు. వీరికి చిత్తశుద్ధి ఉంటే చర్చలో పాల్గొనాలని సూచించారు.