: పీఎం అభ్యర్థిగా రాహుల్ పేరునే ప్రకటించొచ్చు: ఎంపీ, నటి రమ్య
తొలిసారి లోక్ సభకు ఎంపీగా ఎన్నికైన నటి రమ్య ఢిల్లీలో ఈ రోజు జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోవడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. అయితే, త్వరలో పీఎం అభ్యర్థిపై పార్టీ ప్రకటన చేసే అవకాశముందని, అది రేపే కాకపోవచ్చన్నారు. కాగా, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ నే ప్రకటించాలని తాను కోరుతున్నట్లు ఎంపీ రమ్య అన్నారు.