: మోడీ గుడ్ మ్యాన్: 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ మంచి మనిషి (గుడ్ మ్యాన్) అని ఆధ్యాత్మిక గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ప్రశంసించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి తనకు తెలియదన్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ లో దివ్యతస్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రవిశంకర్ ను... మోడీ, రాహుల్ పై అభిప్రాయం ఏంటని విలేకరులు అడిగినప్పుడు ఆయనిలా స్పందించారు. రాహుల్ గురించి తెలియదని.. మోడీతో మాత్రం పలుసార్లు సమావేశమయ్యానని.. ఆయన మంచివారిగా కనిపించారని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు పాలనాపరంగా విఫలమవుతున్నట్లు తేలిందని, ఒకే పార్టీ మెజారిటీతో అధికారంలోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.