: నేను మాట్లాడిన తర్వాత టీఆర్ఎస్ ఏం చెబుతుందో చూస్తా: సీఎం కిరణ్
రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని తానెందుకు వ్యతిరేకిస్తున్నానో... సభలో మాట్లాడేటప్పుడు చెబుతానని సీఎం కిరణ్ అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన ఈ విషయం తెలిపారు. తాను మాట్లాడేటప్పుడు రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోతుందో తెలియజేస్తానని చెప్పారు. అప్పుడు టీఆర్ఎస్ ఏం సమాధానమిస్తుందో చూస్తానని తెలిపారు.