: మరో భారతీయురాలికి ఒబామా పట్టం
మరోసారి భారతీయుల సమర్థత పట్ల తనకున్న విశ్వాసాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా చాటుకున్నారు. భారత సంతతికి చెందిన మహిళా పారిశ్రామిక వేత్త షమీనాసింగ్ ను కీలక పదవి కోసం ఎంపిక చేశారు. ఆమెను కార్పొరేషన్ ఫర్ నేషనల్ అండ్ కమ్యూనిటీ సర్వీసు బోర్డు డైరెక్టర్ గా నియమించారు. ప్రభుత్వరంగ ఏజెన్సీ అయిన ఈ కార్పొరేషన్ అమెరికా సంస్కృతికి తోడ్పాటునందిస్తూ.. జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం షమీనాసింగ్ మాస్టర్ కార్డ్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ గ్రూపులో ప్రభుత్వ సామాజిక కార్యక్రమాలకు అంతర్జాతీయ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.