: శాసనసభ సోమవారానికి వాయిదా
శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం నుంచీ వరుసగా రెండు సార్లు వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక సభాపతి మనోహర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.