: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలు
మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన తన కారులో హైదరాబాద్ వెళ్తుండగా రాజీవ్ రహదారిపై ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు భాగం ధ్వంసమైంది. అనంతరం ఆయన వేరే కారులో హైదరాబాద్ వెళ్లారు.