: మెదడులోని రెండు వైపుల భాగాలతో మాటలు
మనం మాట్లాడటానికి మెదడులోని ఒకవైపు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటామని ఇప్పటివరకు భావించారు. అయితే మెదడులోని రెండు వైపుల భాగాలను మాట్లాడటానికి ఉపయోగించుకుంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైందని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన బిజన్ పెసరన్ తెలిపారు. మాట ఎలా పుడుతుందనేది ఈ అధ్యయనం ద్వారా మరింత బాగా అర్ధం చేసుకోగలిగామని, పక్షవాతం వచ్చి మాట్లాడలేకపోతున్న వారికి కొత్త చికిత్సల రూపకల్పనకు ఇది దోహదపడగలదని భావిస్తున్నట్టు పెసరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.