: పిల్లల్లో ఊబకాయం సమస్య తగ్గాలంటే...!


ముఖ్యంగా పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు మూలకారణం ఫాస్ట్ పుడ్ అనే అభిప్రాయం మనలో చాలా మందిలో ఉంది. కానీ, ఈ అభిప్రాయం సరైంది కాదని నార్త్ కెరొలినా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. మన దైనందిన జీవితంలో పాటించే ఆహారపు అలవాట్లు కూడా చిన్నారుల బరువు, శరీరతత్వాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

పిల్లల్లో స్థూలకాయానికి సంబంధించిన అధ్యయనం నిమిత్తం పరిశోధకులు వివిధ ప్రాంతాలకు చెందిన 4,466 మంది పిల్లలను ఎంపిక చేసుకున్నారు. వీరంతా 2 నుంచి 18 సంవత్సరాల వయసువారే. వీరిని అసలు ఫాస్ట్ పుడ్ జోలికి వెళ్లనివారు, తక్కువ మోతాదులో తీసుకునేవారు, అదేపనిగా ఫాస్ట్ పుడ్ ను తీసుకునేవారు ... ఇలా కేటగిరీలుగా విభజించారు. తరువాత వీరందరి ఆహారపు అలవాట్లను, ఎత్తు, బరువులను రెండేళ్ల పాటు సునిశితంగా అధ్యయనం చేసి, ఏ కారణం మూలంగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారనే అంశాన్ని పరిశోధకులు విశ్లేషించారు. తాజా కూరలు, పండ్లను అరుదుగా తీసుకోవడం కూడా స్థూలకాయానికి కారణమని, అందుకే పిల్లలకు ఇచ్చే భోజనం విషయంలో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News