: ఇంటర్నెట్ కేఫ్ లో మైనర్ బాలికపై లైంగిక దాడి


‘నిర్భయ’ చట్టం అమల్లోకి వచ్చినా ఆడవారి పట్ల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా హైదరాబాదు, మలక్ పేటలోని అంతర్జాల కేంద్రం (ఇంటర్నెట్ కేఫ్)లో పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ వినియోగించుకునేందుకు వచ్చిన బాలికపై నిర్వాహకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News