: దేశ భవిష్యత్తులో ఏఐఏడీఎంకే కీలకపాత్ర పోషించాలి: జయలలిత
రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో తమ పార్టీ కీలకపాత్ర పోషించాలని ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అభిలషించారు. దీనికోసం రానున్న ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిల్లోని నలభై లోక్ సభ స్థానాలనూ గెలవాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆమె లేఖ రాశారు. అన్ని లోకసభ సీట్లు గెలుచుకుంటేనే ఎంజీఆర్ కీర్తి పతాకను ఎగురవేయగలుగుతామని లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాలకు డీఎంకే చేయూతను ఇవ్వడం వల్లే తమిళులకు తీరని అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. దేశంలో అమలవుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు.