: ఏఐసీసీ సమావేశానికి వెళ్లి తీరుతా: సబ్బంహరి
ఏఐసీసీ సమావేశానికి రావొద్దని కొందరికి సందేశం రావడం విచారకరమని ఎంపీ సబ్బంహరి అన్నారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తామనే భావనతోనే తమకు సమావేశానికి ఆహ్వానం పంపలేదని భావించాల్సి వస్తోందన్నారు. అయితే సభ్యులుగా తమ హక్కును ఉపయోగించుకోవడంలో తప్పు లేదని సబ్బం అభిప్రాయపడ్డారు. రేపు (శుక్రవారం) జరిగే ఏఐసీసీ సమావేశానికి వెళ్లి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.