: తిరుమలలో ఆందోళనలు నిషిద్ధం, అందుకే భక్తులపై కేసులు..!


ముక్కోటి ఏకాదశి పర్వదినాన వీఐపీల సేవలో తరించిన టీటీడీ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులకు వెంకన్న దర్శనానికి టిక్కెట్లు దొరకకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. అయితే టీటీడీ అధికారులు సమస్యను చక్కదిద్దాల్సింది పోయి.. భక్తులపై కేసులు పెట్టడంతో మఠాధిపతులు, పలు ధార్మిక సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా కమలానంద భారతి కూడా టీటీడీ చర్యను ఖండించారు. అరెస్ట్ చేసిన భక్తులను విడుదల చేయకపోతే హిందూ ధార్మిక సంఘాలతో కలసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

అయితే.. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆందోళనలు నిషిద్ధమని, చట్టప్రకారమే కేసులు పెట్టామని టీటీడీ ప్రధాన భద్రతాధికారి రాజశేఖర్ బాబు చెప్పుకొచ్చారు. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం వచ్చిన గవర్నర్ ను ఈ విషయమై వివరణ కోరినా.. ఆయన నోరు మెదపలేదు. అయితే శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై కేసులు పెట్టడం టీటీడీ చరిత్రలోనే మొదటిసారని ఆరోపణలు వినవస్తున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. సామాన్య భక్తులకు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన టీటీడీ, చివరికి భక్తులపైనే కేసులు పెట్టడం శోచనీయమని పలు వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News