: బన్నీకి కూతురు పుట్టలేదు.. కోడలు మాత్రం గర్భవతే: అల్లు అరవింద్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రయ్యాడని, ఆయన భార్య స్నేహారెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందనీ నిన్న మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమే అని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పష్టం చేశారు. తమ కోడలు స్నేహారెడ్డి గర్భవతని, అయితే డెలివరీ కావడానికి మరి కొన్ని నెలలు పడుతుందని తెలిపారు. సరైన ఆధారాలు లేకుండా ఎలాంటి వార్తలను ప్రచురించవద్దని ఆయన మీడియాను కోరారు. ఏదైనా శుభవార్త ఉంటే తాము తెలియజేస్తామని చెప్పారు.