: ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానం అందకపోవడం దారుణం: లగడపాటి
ఈ నెల 17న(రేపు) ఢిల్లీలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సదస్సుకు ఆరు మంది సీమాంధ్ర ఎంపీలకు ఆహ్వానం అందకపోవడంపై ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిలుపు రాకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయంపై ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో తేల్చుకుంటానని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో లగడపాటి మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ వాదిగా పాల్గొనే అధికారం తనకు ఉందన్నారు. హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు. అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పై కాదని యూపీఏ ప్రభుత్వంపైనేనని వివరించారు. మేనిఫెస్టోకి వ్యతిరేకంగా వ్యవహరించడం అధిష్ఠానానికి సరికాదని హితవు చెప్పారు.