: రాహుల్ తో సమస్య ఉన్నవాళ్లు పార్టీ నుంచి వెళ్లొచ్చు: ఖుర్షీద్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, మరికొంతమంది మాత్రం రాహుల్ కు వ్యతిరేకంగా ఉన్నారు. రాహుల్ నే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తుండటం వారికి ఏమాత్రం గిట్టడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ తో ఎవరికైనా ఇబ్బంది ఉంటే, వారు పార్టీని విడిచి వెళ్లొచ్చని విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. పార్టీలో తరాల మార్పుకు సమయం వచ్చిందన్న ఆయన రాహుల్ తో ఎలాంటి సర్దుబాటు సమస్యలు ఉండవన్నారు.