: మీడియాపై ఆంక్షలు విధించిన ఢిల్లీ హైకోర్టు
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ విషయంలో మీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ కేసులకు సంబంధించి అభ్యంతరకర అంశాలను తొలగించాలని రెండు టీవీ ఛానెళ్లు, ఓ వార్తాపత్రికకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే జస్టిస్ స్వతంత్ర కుమార్ ఫొటోను ప్రచురించరాదంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఫిబ్రవరి 24వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని న్యాయస్థానం పేర్కొంది.