: పీఎం అవుతానంటున్న గోవా సీఎం!


దేశానికి ప్రధాని కావాలని చాలా మంది రాజకీయ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కూడా ప్రధాని కావాలని ఆశపడుతున్నారు. మీడియా తనకు మద్దతిస్తే పీఎం అవుతానని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ పీఎం అభ్యర్థిగా ప్రకటించిన నరేంద్ర మోడీ స్థానంలో పారిక్కర్ ను ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించే ఆయన పై విధంగా మాట్లాడినట్లు ఆ రాష్ట్ర బీజేపీ సెక్రటరీ తెలిపారు. నిరాడంబరతకు బీజేపీ విలువ ఇస్తే మోడీని వదులుకుని, ప్రధాని అభ్యర్థిగా పారక్కర్ పేరును ప్రకటించాలని మూడు రోజుల కిందట గోవా ఏఏపీ అధికార ప్రతినిధి దినేష్ వాఘేలా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News