: తిరుమలలో వైభవంగా పార్వేటి ఉత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో కనుమ సందర్భంగా ఇవాళ (గురువారం) పార్వేటి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగే శ్రీవారి ఆలయంలో ఇవాళ పలు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఆండాళ్ శ్రీ గోదాదేవి పరిణయోత్సవం, ప్రణయ కలహ ఉత్సవాలు జరుగనున్నాయి. అలాగే.. మరోపక్క రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక, తుమ్మలగుంటలో టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర గోశాలలో గోమహోత్సవం జరుగుతోంది. ఉదయం వేణుగానంతో ప్రారంభమైన గోమహోత్సవంలో వేదపారాయణం, భజనలు, కోలాటంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.