: కేంద్రమంత్రి పనబాకపై మండిపడుతున్న మహిళా సంఘాలు
కుటుంబానికి ఆరు సిలిండర్లే చాలన్న కేంద్ర మంత్రి పనబాక లక్షిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తొమ్మిది సిలిండర్లే చాలడంలేదని ఒకవైపు బాధపడుతుంటే, ఉన్నవాటిని తగ్గించాలని పనబాక చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ రోజైనా వంట చేస్తే గ్యాస్ గురించి అవగాహన ఉండేదని మహిళా సంఘాల నేతలు ఎద్దేవా చేశారు. ఎక్కువ సిలిండర్లు ఇస్తే అమ్ముకుంటారంటూ పనబాక చేసిన వ్యాఖ్యలు సామాన్యులను దొంగలుగా చిత్రీకరించేలా ఉన్నాయని అన్నారు. విజయవాడలో ఐద్యా ఆధ్వర్యంలో పనబాకకు వ్యతిరేకంగా ఆందోళన, ధర్నా చేపట్టారు.