: 'ఎవడు' అశ్లీల పోస్టర్లపై రాంచరణ్ సహా 9 మందిపై కేసు
'ఎవడు' సినిమా అశ్లీల పోస్టర్లకు సంబంధించి హీరో రాంచరణ్ సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు తెలిపారు. ఎవడు చిత్రం పోస్టర్లు చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ చిత్ర కథానాయకుడు చరణ్, దర్శకుడు, నిర్మాత, ఇతరులపై కె.నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దాంతో, ఐపీసీలోని 'రెప్రజెంటేషన్ ఆప్ ఉమెన్ ప్రొహిబిషన్ 1986' చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.