: రాహుల్ మరో పార్టీలో ఉండి ఉంటే పని నిల్: జైట్లీ
ఒకే ఒక్కడి ఆట అంటూ మోడీని విమర్శించిన రాహుల్ పై బీజేపీ నేత అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. రాహుల్ వేరొక పార్టీలో ఉండి ఉంటే ఆయనకు ఇప్పటి వరకు ఒక్క బాధ్యత కూడా ఇచ్చి ఉండేవారు కాదన్నారు. కాంగ్రెస్.. వ్యక్తులు, వారసత్వం ఆధారంగా నడిచే పార్టీ కనుక రాహుల్ నేత కాగలిగారని విమర్శించారు. అలాగే, ఎలాంటి ప్రశ్నకు తావులేకుండా ఆ పార్టీ రాహుల్ ను సుప్రీం నేతగా ఎన్నుకోగలదన్నారు.