: విశాఖ-సికింద్రాబాదు మధ్య రెండు ప్రత్యేక రైళ్లు


సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం - సికింద్రాబాదు స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన (శుక్రవారం) విశాఖ-సికింద్రాబాదు ప్రత్యేక రైలు (నెం. 08501) విశాఖ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరుతుందని ప్రకటించారు. 18వ తేదీన సికింద్రాబాదు-విశాఖ ప్రత్యేక రైలు (నెం.08502) సికింద్రాబాదు నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News