: ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి సిద్ధం: అశోక్ బాబు
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. మరోసారి జాతీయ పార్టీ నేతలను కలసి సమైక్య రాష్ట్ర ఆవశ్యకత గురించి వివరిస్తామని ఆయన చెప్పారు. గతంలో జాతీయ పార్టీ నేతలను కలిసినప్పుడు అసెంబ్లీ అభిప్రాయం వెలువరించిన తరువాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అభ్యంతరాలున్నాయని భారతీయ జనతా పార్టీ చెప్పిందన్నారు. రాష్ట్ర విభజనపై న్యాయపోరాటం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నాయని ఆయన తెలిపారు. అవసరమైతే తమ సంఘం తరఫున ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమని అశోక్ బాబు ప్రకటించారు.