: అగ్నిప్రమాదంలో బాలుడు సజీవ దహనం


గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో ఇవాళ (బుధవారం) అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్లో చిక్కుకున్న ఓ బాలుడు సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News