: లైంగిక దాడి చేసారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు: హాస్టల్ వార్డెన్


హైదరాబాదు, వనస్థలిపురం సమీపంలోని బీఎన్ రెడ్డి నగర్ లో ఉన్న శ్రీ సాయి మణికంఠ లేడీస్ హాస్టల్ లో నిర్వాహకుడు, అతని స్నేహితులు లైంగిక దాడి చేశారంటూ బీహార్ యువతులు వనస్థలిపురం పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీయగా.. వార్డెన్ నవనీత పెదవి విప్పారు. హాస్టల్ లో ఉంటున్న యువతులపై తన భర్త, అతని స్నేహితులు కలిసి లైంగిక దాడి చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె చెప్పారు. కుట్రలో భాగంగానే ఆ మహిళలు ఫిర్యాదు చేశారని ఆమె అన్నారు. వారి ప్రవర్తన బాగోలేదని మందలించామని.. అయితే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి తన పైన, తన భర్తపైన దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News