: మరోసారి ఖైదీ రోగుల పరారీ యత్నం
ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి మరోసారి ఖైదీ రోగులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. కిటీకీ ఊచలు విరగదీసి తప్పించుకునేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈ ఘటన రాత్రి జరిగిందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ ప్రారంభించారు. గత డిసెంబర్ లో ఇదే ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీ మానసిక రోగులు 10 మంది గోడను బద్ధలు చేసుకుని పరారైన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు కష్టపడి వారిని పట్టుకోగలిగారు. ఈ ఘటన తర్వాత అయినా పోలీసులు ఎర్రగడ్డ ఆస్పత్రి వద్ద భద్రత పెంచలేదని తాజా ఘటన చూస్తే తెలుస్తోంది.