: ముగిసిన జేపీ సత్యాగ్రహ దీక్ష
లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) చేపట్టిన మౌన సత్యాగ్రహ దీక్ష ముగిసింది. ప్రొ. హరగోపాల్, విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు జేపీ దీక్షను విరమింపజేశారు. హైదరాబాదులో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల రక్షణకు, లోక్ సత్తా నేతలపై పెట్టిన కేసులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అవినీతిపై పోరాటానికి 18 ఏళ్లుగా లోక్ సత్తా చేపట్టిన ఉద్యమం ఇప్పుడే ఓ దారికి వస్తోందని జేపీ అన్నారు. గోకుల్ ఫ్లాట్స్ లో రహదారికి అడ్డంగా ప్రహారీ గోడ నిర్మించడాన్ని ఆయన తప్పుబట్టారు. రహదారిని ఆక్రమిస్తే అడ్డుకునే అధికారం కలెక్టర్ కు ఉంటుందని, హైదరాబాదు శివార్లలో ప్రభుత్వ భూములు ఆక్రమించినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.