: పడవ మునిగి 200 మంది మృత్యువాత
దక్షిణ సూడాన్ అల్లర్లతో అట్టుకుడుతున్న విషయం తెలిసిందే. అయితే అల్లర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 200 మంది పౌరులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన దారుణ విషాద ఘటన సూడాన్ దేశంలో (మంగళవారం) జరిగింది. మలక్కల్ సిటీ నుంచి వైట్ నైల్ నది మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించిన వీరంతా పడవ బోల్తా పడటంతో చనిపోయారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. అయితే.. పడవ సామర్థ్యానికి మించి రెట్టింపు సంఖ్యలో ప్రజలు ఎక్కడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.