: మోడీతో కలసి పతంగులు ఎగురవేసిన సల్మాన్ ఖాన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో కలసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పతంగులు ఎగురవేశాడు. అహ్మదాబాద్ లో జరిగిన 'కైట్స్ ఫెస్టివల్'లో వీరిద్దరూ సందడి చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, దేశానికి గొప్ప వ్యక్తే ప్రధాని కావాలని అభిప్రాయపడ్డాడు. మోడీ ఒక గొప్ప వ్యక్తని కితాబిచ్చాడు. మనమంతా ఉన్నతమైన వ్యక్తికే ఓటు వేద్దామని ప్రజలను ఉద్దేశించి అన్నాడు. దేశమంతా గుజరాత్ తరహాలో అభివృద్ధి చెందాలని కోరుతున్నానన్నాడు. సల్మాన్ మాట్లాడుతున్నంత సేపు మోడీ ముసిముసి నవ్వులు నవ్వుతూనే ఉన్నారు. అంతకు ముందు వీరిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. తాను, సల్మాన్ కలసి ఉన్న ఫొటోను మోడీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే బాలీవుడ్ లో అనేక మంది మోడీకి తమ మద్దతు ప్రకటించారు.