: మహిళలను బూటు కాళ్లతో తన్ని.. చెంపలు పగులగొట్టిన యూపీ పోలీసులు
ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ పాలనలో మరో అరాచకం జరిగింది. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ నేతలు రౌడీయిజంతో విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు పోలీసులు కూడా రౌడీల్లా మారిపోయారు. మహిళలన్న కనీస ఇంగితం కూడా లేకుండా.. మగ పోలీసులు వారిపై చేయి చేసుకున్నారు. వాళ్లేమీ నేరం చేయలేదు.. రోడ్డు ప్రమాదంలో తమ వారు మృతి చెందారన్న కోపంతో ఫిరోజాబాద్ పట్టణంలో నిరసన ప్రదర్శనకు దిగారు. అడ్డొస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్లవచ్చు. కానీ, పోలీసులు విచక్షణ మరచి, ప్రజా సేవకులమన్న ఆలోచన లేకుండా మహిళలను ఈడ్చి పారేశారు. బూటుకాళ్లతో తన్నారు. మహిళల వెనుక భాగంలో లాఠీలతో బాదారు. చెంపలు పగలగొట్టారు. చూసేవారిలోనూ పోలీసులపై ఆగ్రహం కట్టలు తెంచుకునేలా వ్రవర్తించారు.