: పనిమనిషికి రూ. 600కోట్ల ఆస్తి రాసిచ్చేసిన పెద్దాయన
మానవత్వం, దానగుణం అంచనాలకు అందవు. దీన్నే మరోసారి గుర్తు చేశాడు గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త గజరాజసింహ జడేజా. తన ఇంట్లో 40 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళ వీనూభాయి పేర రూ. 600 కోట్ల రూపాయల ఆస్తులను విల్లురాసి మరీ వెళ్లిపోయారు. గతేడాది సెప్టెంబర్ లో జడేజా కన్నుమూశారు. వీనూభాయి పేరిట పెద్దాయన ఆస్తులు రాసేసాడని తెలుసుకున్న జడేజా కుటుంబ సభ్యులు ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను నిర్బంధించారు. ఇటీవలే పోలీసులు వారిని రక్షించారు.