: ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఆదిత్యుని దర్శించుకునేందుకు ఇవాళ (మంగళవారం) వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. దర్శనానంతరం ఆలయ ఆవరణలోని అనివెట్టి మండపంలో అన్నప్రాసన కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులకు అన్నప్రాసన చేసి, భోగిపండ్లు పోశారు.