: కర్నూలులో బాలసాయిబాబా జన్మదిన వేడుకలు
కర్నూలులో ఇవాళ బాలసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, బస్వరాజు సారయ్య తదితర నేతలు పాల్గొన్నారు. బాలసాయిబాబా సేవలను ఈ సందర్భంగా కిల్లి కృపారాణి కొనియాడారు.