: తెలుగు వారింట సంక్రాంతి సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్నారు. ఇవాళ (మంగళవారం) వేకువజామునే వీధుల్లో భోగిమంటలు వేశారు. మహిళలు ఇంటి ముంగిట రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్ది సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు.
సంక్రాంతి శోభతో తిరుపతి నగరం కళకళలాడుతోంది. తిరుచానూరులోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మొదలయ్యాయి. మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బిళ్లు పెట్టి సాంప్రదాయాలను గుర్తుచేశారు. గంగిరెద్దుల విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. హరిదాసులు కీర్తనలతో అలరించారు.