: దామోదర్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారు: కోమటిరెడ్డి
తన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. దామోదర్ రెడ్డి రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని... గూండాలను వెనకేసుకొచ్చి భయోత్పాతం సృష్టించాలనుకుంటున్నారని తెలిపారు. దామోదర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ రోజు భువనగిరిలో ఏఐసీసీ పరిశీలకుడి ముందే దామోదర్, కోమటిరెడ్డి వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు.