: లీటర్ కు రూ. 2 తగ్గిన పెట్రోల్ ధరలు
వాహనదారులకు శుభవార్త! పెట్రోల్ ధర లీటర్ కు రూ. 2 తగ్గింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా, తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. గత మూడు నెలల్లో పెట్రోల్ ధరలు సవరించడం ఇది మూడోసారి. కాగా, కొద్ది రోజుల క్రితం పెట్రోల్ ధర రూపాయి తగ్గనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఏకంగా రెండు రూపాయిలు తగ్గించడం విశేషం.