: శుంఠ అనే పదాన్ని ఉపసంహరించుకుంటున్నా: జైపాల్
సీమాంధ్ర నేతలను శుంఠ అని సంభోదించడంపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. పండిత పుత్ర: పరమ శుంఠ: అనే సామెతను దృష్టిలో ఉంచుకునే తాను ఈ పదాన్ని వాడానని... దీన్ని ఓ తిట్టుగా చిత్రీకరించారని తెలిపారు. టంగుటూరి, పట్టాభిలను శ్లాఘిస్తూ... సీమాంధ్ర నేతలను పండిత పుత్ర: పరమ శుంఠ: అన్న కోణంలో విమర్శించానని చెప్పారు. తాను వాడిన ఈ పదాన్ని ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. నేటి సీమాంధ్ర నేతలు తెలంగాణ అనివార్యతను గుర్తించలేకపోతున్నారనే ఆవేదనలోనే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.