: భోగి పండ్లతో రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకం


శ్రీకాకుళం పట్టణ సమీపంలో నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి భోగిపండ్లతో అబిషేకం నిర్వహించనున్నారు. కుంచాల కురమ్యపేట గ్రామంలోని శ్రీచక్రపురంలో మంగళవారం ఉదయం 9 గంటలకు భోగిపండ్లు, నాణేలతో అమ్మవారి అభిషేకం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆ నాణేలను ఆలయ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ భక్తులకు అందజేస్తారు. అలాగే 16వ తేదీన పౌర్ణమి సందర్భంగా వేకువ జామున 4 గంటల నుంచి అమ్మవారికి శ్రీ చక్రార్చన, 1001 శ్రీ చక్ర మేరువుల వద్ద కుంకుమాభిషేకం జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News