: 34 మంది భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక
భారత జాలర్లపై కఠిన వైఖరి అవలంబిస్తున్న శ్రీలంక కొంత వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. గత రెండు రోజుల్లో అరెస్టు చేసిన 53 మంది భారత జాలర్లలో 34 మందిని ఈ రోజు విడుదల చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో.. శ్రీలంక రాయబారికి భారత్ నోటీసులు జారీ చేసింది. అరెస్టు చేసిన జాలర్లను వదిలిపెట్టాలని కోరింది. దీంతో, సానుకూలంగా స్పందించిన లంక జాలర్లను వదిలిపెట్టింది.