: ఖమ్మంలో జాతీయ స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలు
ఖమ్మంలో 59వ జాతీయ స్థాయి బాల్ బాడ్మింటన్ పోటీలు మూడో రోజున ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ మైదానంలో జరుగుతున్న ఈ పోటీలు 15వ తేదీ (బుధవారం) వరకు జరుగనున్న విషయం విదితమే. ఈ పోటీలను పెవిలియన్ గ్రౌండ్ లోని పది కోర్టుల్లో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో మ్యాచ్ ల నిర్వహణ కోసం రెండు కోర్టులలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. 33 పురుషుల జట్లు, 29 మహిళా జట్లు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. మొత్తం 764 మంది క్రీడాకారులు బాల్ బాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటున్నారు.