: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి కన్నుమూత
డా.రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు కళ్లం అంజిరెడ్డి (73) మృతి చెందారు. గత ఆరు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. 1940లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో అంజిరెడ్డి జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అంజిరెడ్డిని పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం సత్కరించింది.
- Loading...
More Telugu News
- Loading...