: యువతిని మోసగించిన 'త్రీజీ లవ్' నిర్మాత ప్రతాప్ అరెస్ట్
యువతిని ప్రేమ పేరుతో మోసగించిన 'త్రీజీ లవ్' చిత్ర నిర్మాత కోలగట్ల ప్రతాప్ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకుంటానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ లోబరుచుకుని మోసం చేశాడంటూ ప్రతాప్ పై కరీంనగర్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయనగరంలో ప్రతాప్ ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం కరీంనగర్ కు తరలించినట్లు తెలుస్తోంది.