: సీఎంకు మాటలెక్కువ, చేతలు తక్కువ: చంద్రబాబు


ముఖ్యమంత్రి కిరణ్ కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఆకాశాన్నంటిన ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఏటీఎం దోపిడీదారులు, ఎర్రచందనం స్మగ్లర్లు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ వీరప్పన్ లా మారిపోయారని మండిపడ్డారు. విభజన కోసం పాకులాడుతున్న వైఎస్సార్సీపీకి సమైక్యాంధ్ర గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. ఈ రోజు స్వగ్రామం నారావారిపల్లెకు బయలుదేరిన చంద్రబాబు మార్గమధ్యంలో చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పట్టవస్త్రాలు సమర్పించారు. అనంతరం, అక్కడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

  • Loading...

More Telugu News